![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -334 లో..... రామలక్ష్మితో సీతాకాంత్ మాట్లాడతాడు. రామలక్ష్మి కోపంగా అక్కడ నుండి వెళిపోతుంది. అప్పుడే రామ్ వచ్చి నిన్ను ఆ మేడం కొట్టింది.. నువ్వు తనతో మాట్లాడడం నాకు ఇష్టం లేదని అంటాడు. నాకు ఇష్టమే.. తను నాకు తెలుసు అని సీతాకాంత్ అంటాడు. నిన్ను బాగా చూసుకోవడానికి ఒక అమ్మ కావాలి కదా.. ఆ మిస్ నీకు అమ్మ అయితే బాగుంటుందని అనుకుంటున్నానని సీతాకాంత్ అంటాడు. నో నాకు ఇష్టం లేదని రామ్ గట్టిగా అరుస్తాడు.
ఆ తర్వాత శ్రీలత, శ్రీవల్లిలు షాపింగ్ కీ వెళ్తారు. షాపింగ్ పూర్తి అయ్యాక కార్ కోసం వెయిట్ చేస్తుంటే.. దూరంగా శ్రీవల్లికి రామలక్ష్మి కన్పిస్తుంది. అది చూసి శ్రీవల్లి దెయ్యమంటూ శ్రీలత దగ్గరికి వచ్చి చెప్తుంది. రామలక్ష్మిని శ్రీలత చూసి దెయ్యం అంటూ భయపడుతుంది. ఇద్దరు భయపడుతుండగా.. అప్పుడే సందీప్ వస్తాడు. అతనికి కూడా రామలక్ష్మిని చూపిస్తారు. అతను కూడా భయపడతాడు. మరుసటిరోజు ఉదయం సీతాకాంత్ రామ్ ని స్కూల్ కి తీసుకొని వెళ్ళడానికి రెడీ అయి వెయిట్ చేస్తుంటాడు. అప్పుడే రామ్ రెడీ అయి వస్తాడు.. శ్రీలత, సందీప్, శ్రీవల్లిలు మెడలో తాయాత్తు కట్టుకొని వస్తారు. ఏంటి ఈ అవతారం అని సీతాకాంత్ అడుగగా.. రామలక్ష్మి విషయం చెప్తే మళ్ళీ గుర్తుచేసినట్లు అవుతుందని ఆ విషయం చెయ్యకుండా ఏదో చెప్పి డైవర్ట్ చేస్తారు.
ఆ తర్వాత రామ్ ని సీతాకాంత్ స్కూల్ కి తీసుకొని వెళ్తాడు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. ప్రోగ్రెస్ కార్డు చూసి ఈ బాబు స్పోర్ట్స్ లో ఫస్ట్ ఉన్నాడు.. స్టడీ లో లాస్ట్ ఉన్నాడని రామలక్ష్మి అంటుంది. స్టడీలో కూడా ఫస్ట్ కానీ ఈ మధ్యనే ఇలా అయ్యాడని రామ్ వాళ్ళ క్లాస్ టీచర్ చెప్తుంది. అయితే సెవెన్ టేబుల్ చెప్పమని రామ్ తో రామలక్ష్మి అనగానే మొదట బానే చెప్తాడు. తర్వాత నేను చెప్పను నువ్వు మా నాన్నని కొట్టావ్.. నువ్వు చెప్తే నేనెందుకు వినాలి. మా నాన్నకి సారీ చెప్తే నువ్వు చెప్పినట్లు వింటానని రామ్ అంటాడు. ఇలా అయితే కష్టం.. నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ చెయ్యాలంటే సమ్మర్ క్లాసెస్ కి పంపాలని సీతాకాంత్ కి రామలక్ష్మి చెప్తుంది. నువ్వెలా చెప్తే అలా రామలక్ష్మి అని సీతాకాంత్ అనగానే.. రామలక్ష్మి కోపంగా వెళ్ళిపోతుంది. నువ్వే నా రామాలక్ష్మివి అని నువ్వే బయటపడేలా చేస్తానని సీతాకాంత్ అనుకుంటాడు. మరొకవైపు రామలక్ష్మి బీరువా లో నుండి తాళి తీసి చూసి బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |